Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Kaif: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాదు.. 2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే అసలైన కీ పాయింట్ వేరే ఉందంటూ మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నమెంట్‌పై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. సౌతాఫ్రికాలో ఇప్పుడు పిచ్‌లు పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయాయని, అక్కడ బౌలర్ల కంటే బ్యాటర్లదే హవా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సెమీఫైనల్స్, ఫైనల్స్ జరిగే కేప్‌టౌన్, సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్ లాంటి కీలక వేదికలపై కూడా పిచ్‌లు బ్యాటింగ్‌కు సహకరిస్తాయని, అందుకే ఏ జట్టులో అయితే నాణ్యమైన బౌలింగ్ అటాక్ ఉంటుందో ఆ జట్టే వరల్డ్ కప్ గెలుస్తుందని కైఫ్ స్పష్టం చేశారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా లేదా అనే చర్చపై స్పందిస్తూ.. టోర్నమెంట్ నాటికి వారి వయసు 40, 39 ఏళ్లు ఉంటుందని, అయితే వారిద్దరూ ఆడితే పర్వాలేదని, కానీ భారత్ గెలవాలంటే మాత్రం బౌలింగ్, ఫీల్డింగ్ డిపార్ట్మెంట్లను పటిష్టం చేసుకోవడం అత్యంత కీలకమని తేల్చిచెప్పారు. విరాట్ కోహ్లీ ఒక్కడే ఉంటే వరల్డ్ కప్ వచ్చేయదని, విదేశాల్లో మెగా టోర్నమెంట్ గెలవాలంటే ఎవరో ఒక్కరిపై ఆధారపడకుండా అందరూ సమిష్టిగా రాణించాలని కైఫ్ హితవు పలికారు. కోహ్లీ ప్రధాన ఆటగాడే అయినప్పటికీ, మిగతా వాళ్లు కూడా సహకరించినప్పుడే విజయం సాధ్యమన్నారు. ఈ సందర్భంగా 2003 వన్డే వరల్డ్ కప్‌ను ఆయన గుర్తుచేశారు. ఆ టోర్నమెంట్లో సచిన్ టెండూల్కర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచినా, ఒంటిచేత్తో కప్ సాధించలేదని, మిగతా ఆటగాళ్ల సహకారం కూడా ఎంతో ఉందని చెప్పారు. ఆ టోర్నమెంట్లో సచిన్‌తో పాటు యువరాజ్ సింగ్ కీలక పరుగులు చేశాడని, న్యూజిలాండ్‌పై తాను అజేయంగా హాఫ్ సెంచరీ సాధించానని, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా రాణించారని గుర్తుచేశారు. అలాగే బౌలింగ్‌లో ఆశిష్ నెహ్రా ఇంగ్లండ్‌పై మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేయగా, జహీర్ ఖాన్, సీనియర్ బౌలర్ శ్రీనాథ్ అద్భుతంగా రాణించారని, గంగూలీ కెప్టెన్సీ కూడా జట్టు విజయాల్లో కీలకమని కైఫ్ వివరించారు.
Also Read
- APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
- Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
- Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
తాజావార్తలు
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?