డిసెంబర్ 24, శుక్రవారం రాశిఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారు వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాగలవు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. గృహంలో ఏదైనా వస్తువులు పోవటానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులకు సదావశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. అవసరానికి ఋణం దొరుకుతుంది. సేవా, పుణ్య కార్యాలలో మీ శ్రమకు మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలలో మంచి ప్రతిభను కనపరుస్తారు.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
మిథునం : ఈ రోజు ఈ రాశివారు వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి జారిపోయే ఆస్కారం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శన వంటి ఫలితాలున్నాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి శుభదాయకం. ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. స్త్రీలకు అధిక ఒత్తిడి, శ్రమ వలన ఆరోగ్యం మందగిస్తుంది.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని ప్రింటింగ్, స్టేషనరీ వ్యాపారస్థులు ఒత్తిడిని, శ్రమను అధికంగా ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారులకు అధికశ్రమ ఉండును. ఉపాధ్యాయులు మార్పులపై చేయు ప్రయత్నాలు ఫలించగలవు. ప్రముఖులతో, పెద్దలతో అభిప్రాయాలు కలిసివస్తాయి.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని బంగారు, వెండి, వస్త్ర వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువుల రాకతో కుటుంబంలోని వారు ఉల్లాసంగా ఉంటారు. స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. మీ నూతన పథకాలు ఆచరణలో పెట్టి జయం పొందండి. విద్యార్థులకు అధికమైన, చికాకులు ఇబ్బందులు కలుగును.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని గృహ నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జాగ్రత్త వహించినా జయం మీ సొంతమవుతుంది. భాగస్వామికంగా కంటె సొంత వ్యాపారాలకే ప్రాధాన్యత ఇవ్వండి. పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. మీ సంతానం ఇష్టాలకు అడ్డుచెప్పటం మంచిదికాదు.
తుల : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. మీ నిజాయితీ, సమర్థతలకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు ఆకస్మిక ప్రయాణం, ధనప్రాప్తి వంటి శుభఫలితాలున్నాయి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీ సంతానం వివాహ, ఉద్యోగ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని విద్యార్థులు ధ్యేయ సాధనకు మరింత శ్రమించాలి. హోటల్, క్యాటరింగ్ వ్యాపారులకులాభం. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. నిర్మాణ పనుల్లో బిల్డర్లు, పనివారలతో చికాకులు తప్పవు. నిరుద్యోగులు, వృత్తుల వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ధనస్సు : ఈ రోజు బంధు మిత్రుల రాకతో ఈ రాశివారి గృహంలో సందడి కానవస్తుంది. వాహనం ఇతరుకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. మీ ఆలోచనలు గోప్యంగా ఉంచి ఎదుటివారి తత్వన్ని గమనించండి.
మకరం : ఈ రోజు ఈ రాశివారు స్త్రీలతో కలహములు, అన్ని కార్యముల యందు విఘ్నములు ఎదుర్కొంటారు. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కుంభం : ఈ రోజు ఆర్థిక విషయాలలో ఈ రాశివారి లెక్కలు తారుమారు కాగలవు. విద్యా విషయంలో ఏకాగ్రతతో వ్యవహరించాలి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. ప్రలోభాలకు లొంగవద్దు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలకు ఇతోధికంగా ధనం ఖర్చుచేస్తారు. అయిన వారిని ఆప్తులను విందు భోజనానికి ఆహ్వానిస్తారు.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగ వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పొదుపు పథకాలు, చిట్ఫండ్ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదాపడును.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు