డిసెంబర్ 14, మంగళవారం రాశిఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగులకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. విద్యార్థినులకు సహచరుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు. బంధువుల రాకతో చేపట్టి పనులు వాయిదా పడతాయి. ప్రత్యర్థుల కదలికలను ఓ కంట కనిపెట్టటం మంచిది.
వృషభం : ఈ రోజు ఈ రాశివారు ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు.
Also Read
మిథునం : ఈ రోజు ఈ రాశివారికి బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. ఒకనాటి మీ కష్టానికి నేడు ప్రతిఫలం లభిస్తుంది. మీ ఔన్నత్యాన్ని ఎదుటివారు గుర్తిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం అధికం. స్త్రీలు దైవసేవా కార్యక్రమాల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. విద్యార్థునులు వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారు విజ్ఞతతో వ్యవహారించి రుణదాతలను సమాధాన పరుస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. వృత్తిపరంగా ఎదురైన ఆటాకాలను అధికమిస్తారు. కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మీ ఆంతరంగిక, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి వాతావరణంలో మార్పు ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. పట్టింపుల వల్ల స్త్రీలు విలువైన అవకాశాలు కోల్పోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు బదిలీలు, నూతన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దూర ప్రయాణాలలో మెళుకు అవసరం.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. మీ కుటింబీకులతో ఏకీభించలేకపోతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
తుల : ఈ రోజు ఈ రాశివారు బంధువుల రాకతో ధనం అధికంగా వ్యయంగా చేస్తారు. ఓర్పు, పట్టుదతలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, బెదిరింపులు అధికమవుతాయి. ఊహించని ఖర్చులు మీ ఆదాయం మించటంతో ఒకింత ఒడిదుడుకులు తప్పవు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. భాగస్వామిక చర్చలు వాయిదా పడటం మంచిది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరుద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఒక మంచి అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. ఆహార, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారి స్థిరచరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ సంతానం ఉన్నత చదువుల కోసం దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, శ్రమ తప్పవు. చిన్నతరహా పరిశ్రమల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రేమికులు ఇతరుల కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
మకరం : ఈ రోజు ఈ రాశివారి నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీ తదితర వ్యవహారాల్లో పునరాలోచన మంచిది. దైవ సేవా కార్యాక్రమాలల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ముఖ్యం. అదనపు రాబడి దిశగా మీ ఆలోచనలుంటాయి. ఆస్తి వ్యవహారాల్లో పెద్దల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఏ వ్యక్తిని అతిగా విశ్వసించటం మంచిది కాదని గమనించండి. చేపట్టిన పనులు అతికష్టంమ్మీద అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు టెక్నికల్, ఇంజనీరింగ్ కోర్సులలో అవకాశాలు లభిస్తాయి.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు కుటుంబంలోను, చుట్టుపక్కల వారిలోను ఆదరణ లభిస్తుంది. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. ఖర్చులు అదుపు కాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
-
Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!