మేషం: ఈ రోజు ఈ రాశివారిలో ఉన్న అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు కనబడుతున్నాయి.. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి.
వృషభం: ఈ రోజు ఈ రాశివరాకి అనారోగ్య బాధలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి.. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపారం రంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం మంచిది.
మిథునం: ఈ రోజు ఈ రాశివారికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలున్నాయి.. జాగ్రత్త వహించడం మంచిది.. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధులు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి.
కర్కాటకం: ఈ రోజు ఈ రాశిలోని వ్యవసాయరంగంలోనివారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల కొన్ని ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరుకునేవారికి దూరంగా ఉండటం మీకు చాలా మంచిది.
సింహం: ఈ రోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమయ్యే సూచలున్నాయి.
కన్య: ఈ రోజు ఈ రాశివారి విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోనివారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది..
తుల: ఈ రోజు ఈ రాశివారు ఊహించన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి.. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళనకు గురికావాల్సి వస్తుంది.
వృశ్చికం: ఈ రోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది.. రాజకీయరంగంలోనివారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వినే అవకాశాలున్నాయి.
ధనుస్సు: ఈ రోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడిచిపోతుంది.
మకరం: ఈ రోజు ఈ రాశివారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కుంభం: ఈ రోజు ఈ రాశివారు నూతన కార్యక్రమాలను ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది.
మీనం: ఈ రోజు ఈ రాశివారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది.