ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం సూచనల మేరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు సర్కార్ పేర్కొన్నది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదుకాలేదు. ముందస్తు చర్యల్లో భాగంగా నైట్ కర్ఫ్యూ విధించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో కొత్తగా 23 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
Read: దర్భంగా బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ చార్జ్‌షీట్…
గుజరాత్ లో కొత్తగా మరో 7 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 361 కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవరమైతే నైట్ కర్ఫ్యూ విధించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. గుజరాత్‌లోని 8 నగరాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఢిల్లీలో క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించారు.