కరోనా, ఒమిక్రాన్‌తో యూకే వణికిపోతున్నది. ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. క్రిస్మస్ తరువాత కేసులు మరింతగా పెరిగినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మంగళవారం రోజున యూకేలో 1.30 లక్షల కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలియజేసంది. కేసులతో పాటు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ లండన్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది.
Read: ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదు..
కరోనా, ఒమిక్రాన్ వేరియంట్లు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. దీంతో అసుపత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయి. లండన్ లో 54శాతం మేర చేరికలు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరికొన్ని కేసులు ఇలానే పెరిగితే కోవిడ్ ఆసుపత్రులన్నికరోనా రోగులతో నిండిపోతాయని, వైద్యులపై మరింత ఒత్తిడి పెరుగుతుందని, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసులు భారీగా పెరుగుతున్నా బ్రిటన్‌లో కొత్త సంవత్సరం వేడుకలకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడం ఇప్పుడు మరింత భయాన్ని కలిగిస్తున్నది.