పవన్ చెప్పిందే వాస్తవం : నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై, సినిమా ఇండస్ట్రీ సమస్యలపై, టికెట్ రేట్లు, ఆన్లైన్ టికెట్ విధానం, ఏపీలో థియేటర్ల సమస్యలు, ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం తీరుపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇక పనిలో పనిగా సినిమా ప్రముఖులకు కూడా పవన్ చురకలు అంటించారు. అందులో భాగంగానే నాని సినిమా ‘టక్ జగదీష్’ ఓటిటి రిలీజ్ వివాదంపై స్పందిస్తూ ‘ఆ అబ్బాయి నాని ఏం చేస్తాడు? గత్యంతరం లేని పరిస్థితిలో ఓటిటిలో విడుదల చేశాడు. అతని తప్పేం ఉంది? థియేటర్ యజమానులంతా ఆయనపై పడితే ఏంటి అర్థం. వెళ్ళి వైసీపీ నాయకులతో మాట్లాడుకోండి’ అంటూ ఫైర్ అయ్యాడు.
Rea Also : నాని సినిమా కాంట్రవర్సీపై పవన్ రియాక్షన్
Also Read
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్‌లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్‌కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్‌తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్‌హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
తాజాగా నాని సైతం నిన్న పవన్ ఇచ్చినా స్పీచ్ పై స్పందిస్తూ ట్వీట్ చేశారు. “పవన్ కళ్యాణ్ సర్, ఏపీ ప్రభుత్వం మధ్య ఉన్న రాజకీయ విభేదాలను పక్కన పెట్టండి. ఆయన చెప్పిందే వాస్తవం… చిత్ర పరిశ్రమ సమస్యలను జెన్యూన్ గా వెల్లడించారు. ఆ సమస్యలపై వెంటనే శ్రద్ధ పెట్టడం అవసరం. ఇంకా ఆలస్యం కాకముందే ముఖ్యమంత్రి జగన్ గారు, సంబంధిత మంత్రులు ఈ విషయంపై దృష్టి సారించాలని ఒక ఇండస్ట్రీ మెంబెర్ గా నేను వినయంగా అభ్యర్థిస్తున్నాను” అంటూ వరుస ట్వీట్లు చేశారు. ఇక నెమ్మదిగా స్టార్ హీరోలంతా ఒక్కొక్కరూ ఈ వివాదంపై స్పందించే అవకాశం ఉంది.
As a member of film fraternity I humbly request @ysjagan gaaru and concerned Ministers to look in to it before it gets too late for the cinema to revive 🙏🏼 https://t.co/5ShufVbWFL
— Nani (@NameisNani) September 26, 2021
తాజావార్తలు
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
SRH Vs RCB: ఉప్పల్‌లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్‌లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..