మహిళల ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. శుక్రవారం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఎలిమినేటర్‌లో యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సీవర్ బ్రంట్ 38 బంతుల్లో 72 పరుగులు చేసింది. నాట్ సీవర్ బ్రంట్ చెలరేగిపోవడంతో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యస్తికా భాటియా 21, హేలీ మాథ్యూస్ 26, హర్మన్‌ప్రీత్‌కౌర్ 14 రన్స్ చేసింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ రెండు వికెట్లు తీయగా.. అంజలి సర్వానీ, పర్షనీ చోప్రాకు చెరో వికెట్ తీసారు.
Also Read:Opposition Unity: ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.. కాంగ్రెస్ కొత్త ఉద్యమం
అంతకుముందు, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ కెప్టెన్ అలిస్సా హీలీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఈ గేమ్‌లో గెలిచిన జట్టు టోర్నీ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఓడిన జట్టు నాకౌట్ అవుతుంది. యూపీ గెలిచి ఫైనల్స్‌లో స్థానం సంపాదించాలంటే 183 పరుగులు చేయాలి.