MS Dhoni : భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ హెడ్, లలిత్ మోదీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ పాత అపాయింట్‌మెంట్ లెటర్‌ను షేర్ చేశారు. లేఖ ప్రకారం, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌కు జూలై 2012లో వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఉద్యోగాన్ని ఆఫర్ చేశారు. 11ఏళ్ల క్రితం అతడి జాబ్ అపాయింట్‌మెంట్ లెటర్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ధోనీ ఇండియా సిమెంట్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితుడయ్యాడు. అందుకుగానూ నెలకు 43 వేల జీతం ఇస్తున్నట్టు ఆ లెటర్‌లో ఉంది. ఫిక్స్‌డ్ అలవెన్స్‌లు కూడా ఉన్నాయి..
దేశానికి ప్రాతినిధ్యం వహించిన సమయంలో బీసీసీఐ కాంట్రాక్ట్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న క్రికెటర్‌గా ధోని రికార్డులకెక్కాడు. ఇక ఆటను మినహాయిస్తే అడ్వర్టైజ్‌మెంట్స్, ఎండార్స్‌మెంట్ల రూపంలో వద్దన్నా కోట్లు వచ్చి పడేవి. అలాంటి ధోని క్రికెట్‌లోకి రాకముందు రైల్వే శాఖలో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్‌గా విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ధోని పేరిట 2012కు సంబంధించిన పాత అపాయింట్‌మెంట్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియన్ సిమెంట్స్‌లో వైస్ ప్రెసిడెంట్(ఆఫీస్ కేడర్) పోస్టుకు ధోనిని ఎంపిక చేసినట్లుగా అపాయింట్‌మెంట్ లెటర్‌లో ఉంది. ఇక ఈ పోస్టు కింద ధోని నెల జీతం రూ. 43వేలు గా ఉండడం అందరిని ఆశ్చర్యపరిచింది…
అంతేకాదు నెలజీతంతో పాటు అదనంగా స్పెషల్ పే కింద రూ 20వేలు, ఫిక్స్‌డ్ అలెవెన్స్ కింద మరో రూ. 21,970 ఉన్నాయి. హౌస్ రెంటల్ అలెవెన్స్ కింద రూ.20,400.. స్పెషల్ హౌస్ రెంట్ అలెవెన్స్ కింద మరో రూ.8,400.. ఏ బెనిఫిట్స్ లేని స్పెషల్ అలెవెన్స్ కింద రూ. 60వేలు, న్యూస్‌పేపర్ ఖర్చుల కింద రూ.175 ఇవ్వనున్నట్లు లెటర్‌లో పేర్కొన్నారు. మొత్తంగా వైస్ ప్రెసిడెంట్ హోదాలో ధోని సుమారు రూ. లక్షా 60వేలకు పైగా నెలజీతం రూపంలో అందుకున్నాడు. ఇక ఈ లెటర్‌ను ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.. ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది..