Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Minister Ktr Emphasis Spl Sports Policy For Telangana

సమగ్రంగా కొత్త క్రీడల విధానం.. మంత్రి కేటీఆర్

Published Date :January 11, 2022 , 4:03 pm
By NTV WebDesk
సమగ్రంగా కొత్త క్రీడల విధానం.. మంత్రి కేటీఆర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో క్రీడలకు ఇతోధిక ప్రాధాన్యత లభిస్తోంది. తాజాగా కొత్త క్రీడల విధానం రాబోతందన్నారు మంత్రి కేటీఆర్. ఇది దేశంలో అత్యత్తమ విధానం అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో లైఫ్ స్టైల్ మారింది. ప్రాథమిక పాఠశాలల నుండి… ఇది ప్రతి ఒక్కరికీ ఈ విధానం అందాలి. కేవలం పని, చదువు మీదే కాదు. ఆటలు, ఫిజికల్ ఫిట్ నేస్, ఫిజికల్ విద్య తప్పనిసరి. హైదరాబాద్‌లోని దాదాపు పాఠశాలలకు ప్లే గ్రౌండ్స్ లేవు. పిల్లలను కోళ్ల ఫారాలలో కోళ్ల లాగా కుక్కుతున్నారు. మంచి వాతావరణం కనిపించడంలేదు.

ఇలా చేస్తే డాక్టర్లు, యాక్టర్లు, ఇంజనీర్లు ఎలా అవుతారన్నారు మంత్రి కేటీఆర్. జాగింగ్, వాకింగ్ లేకుండా యాక్టివ్‌గా ఎలా ఉండగలం? గ్రామ, పట్టణ, నగర స్థాయిలో ఆటల మీద అవగాహన, అభినివేశం పెంచాలి. కొన్ని నిధుల ప్రోత్సాహకాలు శాఖల వారీగా ఇద్దాం. ఆటల పరికరాలు, గ్రౌండ్స్, stadiums నిర్మాణం జరగాలి. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ఆటల సదుపాయాలు, ఓపెన్ జిమ్స్, ఇతర అంశాలను భాగస్వామ్యం చేయండన్నారు.

ఒడిశా రాష్ట్రం ఆటల విషయంలో గొప్ప మౌలిక వసతులు క్రియేట్ చేశారు. దేశంలో ఎక్కడా అలా జరగలేదు. అక్కడకు వెళ్ళి పరిశీలించండి. అహ్మదాబాద్ వంటి నగరాల్లో క్రికెట్ పై ఎక్కువ దృష్టి పెట్టారు. వాళ్ళు కేవలం వ్యాపారం మాత్రమే చేస్తున్నారు. హాకీ, క్రికెట్ వంటి క్రీడల మీద దృష్టి పెట్టండి. ఒక మోడల్ తయారు చేయండి. పారా అథ్లెటిక్స్ పై కూడా ఎక్సర్ సైజ్ చేయాలన్నారు.

ప్రభుత్వం తరపున మనం సపోర్ట్ చేద్దాం. స్టేట్ ఒలింపిక్ కమిటీ, అన్ని క్రీడల కమిటీలు వున్నాయి. అవి ఏమి చేస్తున్నాయి? ఎవరికీ తెలియదు? వాటి పదవులు రాజకీయ పునరావాస కేంద్రాలు అయ్యాయి. క్రీడల్లో రాజకీయాల జోక్యం ఉండకూడదు. రాజకీయ నాయకులకు క్రీడల పదవులే ఉండవద్దు. నేను కూడా నా క్రీడల పదవులకు రాజీనామా చేస్తా. క్రీడా సంస్థలు ప్రభుత్వంతో కలిసి పని చేసేలా చూడాలి. అన్నిటి సమన్వయ సమావేశం పెట్టండి. జిల్లా యూనిట్ గా…కలెక్టర్లు ముఖ్య భూమిక పోషించాలి. క్రీడా మౌలిక వసతుల భవనం ఉంటుంది. వాటి నిర్వహణ సరిగా వుండడం లేదు.

ఇక్కడ సమన్వయం అవసరమన్నారు. స్పోర్ట్స్ యూనిఫాం క్యాంపెయిన్ వుండాలన్నారు మంత్రి కేటీఆర్. ప్రైవేటు రంగంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ లను ప్రోత్సహిద్దాం. కొరియా దేశంలో ఇలా ఉంది. దానిని పరిశీలించాలి. పంచాయతీ రాజ్ ప్రతి శాఖ నుంచి గ్రీన్ బడ్జెట్ లా, స్పోర్ట్స్ బడ్జెట్‌ పెడదాం. గ్రామీణ ప్రాంతాల మంచి క్రీడాకారులు రావాలంటే అనేకం చేయాలి. మంచి కోచ్‌లు వుండాలి. అలా అయితేనే మంచి క్రీడాకారులు వస్తారు.

గ్యాంబ్లింగ్, బెట్టింగుల మీద సీఎం సీరియస్ గా ఉన్నారు. పాలసీలో దీన్ని స్పష్టంగా రాయండి. స్విమ్మింగ్ ని గ్రామాల్లో బాగా ప్రోత్సహించాలి. ఛాంపియన్స్ ఎక్కడి నుంచో రారు. మనమే తయారు చేయాలి. వ్యక్తిగత ఆటల్లో మన రాష్ట్రం నుంచి అనేక మంది ఉన్నారు. ఎవరైనా క్రీడా సంస్థలు పెడితే, వాళ్లకు మన క్రీడా విధానం వల్ల మాత్రమే లాభం జరగాలి. ఆరోగ్య తెలంగాణ, క్రీడా తెలంగాణ కోసం పిల్లలే కాదు, అందరూ ఫిజికల్, ఫిట్ నెస్ అవగాహన పెంచి, అందరినీ భాగస్వాములను చేసే విధంగా క్రీడా విధానం ఉండాలి. సీఎం సాధ్యమైనంత త్వరగా కొత్త సమగ్రమైన క్రీడా విధానాన్ని దేశానికి ఆదర్శంగా తేవాలని కేటీఆర్ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • Minister KTR
  • Sports
  • Srinivas reddy
  • sub commitee

తాజావార్తలు

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

  • Benjamin Netanyahu: మేం ప్రపంచం కోసం పోరాడుతున్నాం, మాతో కలిసి రండి..

  • Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions