సోషల్ మీడియా రారాజుగా వెలుగొందుతున్న ట్విట్టర్‌కు నూతన సీఈవోగా భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. సంస్థలో చేరిన పదేళ్ల కాలంలోనే పరాగ్ అగర్వాల్ ఉన్నత పదవిని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. ఈ జాబితాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా పరాగ్ అగర్వాల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, మాస్టర్ కార్డ్.. ఇప్పుడు ట్విట్టర్.. ఇలా వీటన్నింటిలో కామన్ పాయింట్ ఉందని.. అదేంటో తెలుసా… ఈ అన్ని కంపెనీల సీఈవోలు ఇండియాలోనే పుట్టి పెరగడం అంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
What do MicroSoft, Google, Adobe, IBM, Micron, Master Card and now Twitter have in common?
— KTR (@KTRBRS) November 30, 2021
All are led by CEOs who grew up in India!
Congratulations to @paraga who’s been chosen as the CEO of Twitter
కాగా ట్విట్టర్ నూతన సీఈవోగా నియమితులైన పరాగ్ అగర్వాల్.. ముంబైలోని ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. 2011లో తన ఎమ్ఎస్ పూర్తయిన తర్వాత ఒక సాధారణ ఇంజినీర్‌గా ట్విట్టర్ లో చేరి తన కెరీర్‌ను ప్రారంభించిన పరాగ్.. ఇప్పుడు ఏకంగా ఆ కంపెనీ సీఈవో కుర్చీలో కూర్చోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: వైరల్.. భారతీయుల టాలెంట్‌పై టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్వీట్