తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం కోసం చంద్రబాబు తహతహ లాడుతున్నారు… కానీ ఆయన భాష చూస్తే జాలేస్తుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అధికారం ఎందుకు కోల్పోయామన్న ఆలోచన చంద్రబాబుకు లేదు… సొంత నియోజకవర్గంలో ఓటమిపై సమీక్ష జరపకుండా అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అని చంద్రబాబు ఇంటింటికి వెళ్లి అడిగి ఉండాల్సింది. రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో చంద్రబాబు పేరు పోయింది. ఆయనకు జవసత్వాలు లేవు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు ఇక జిమ్మిక్కులు ఆపాలి……