శరవేగంగా మక్కా మసీదు పనులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చారిత్రాత్మక మక్కా మసీదులో చేపట్టిన మరమ్మతులు, పునరుద్దరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రంజాన్‌లోపు పనులు పూర్తి చేయాలని మైనారిటీ సంక్షేమ శాఖ హెరిటేజ్ శాఖను కోరింది. 17వ శతాబ్దపు మసీదు మరమ్మతు పనులను 2017లో అధికారులు ప్రారంభించారు. తొలుత 18 నెలల గడువును అధికారులు నిర్దేశించగా వివిధ కారణాలతో ఇప్పటి వరకు 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 8 కోట్లు మంజూరు చేసింది. వారసత్వ కట్టడాల పరిరక్షణ పనులను చేపట్టే ప్రముఖ సంస్థల నుండి టెండర్లు పిలిచింది.

ముంబైకి చెందిన రెండు సంస్థలు పరిరక్షణ ప్రయత్నాలలో చేరినప్పటికీ, అమలుకు సంబంధించిన కొన్ని సమస్యల కారణంగా, ఒక సంస్థ వెనక్కి తగ్గిందని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ హెరిటేజ్ శాఖ పరిరక్షణ పనులను పర్యవేక్షిస్తూ.. మైనారిటీ సంక్షేమ శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), ఇతర ఏజెన్సీల స్థానిక అధికారులతో సమన్వయం చేస్తోంది. రాజ కుటుంబ సభ్యుల సమాధులు ఉండే ‘మక్బరా’ మరమ్మతు పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మసీదు ప్రధాన హాలు పనులు ఇంకా పూర్తి కాలేదని అధికారులు వెల్లడించారు.
Also Read
ప్రధాన ద్వారం, గేట్‌వే పునరుద్ధరణ కూడా గతేడాది పూర్తయిందని తెలిపారు. గత నాలుగేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయని, కాంట్రాక్టర్, నిధులు, ఇటీవల కోవిడ్ మహమ్మారి వంటి పలు సమస్యల కారణంగా పురోగతి మందగించిందని టీఎస్ వక్ఫ్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం మసీదు ప్రధాన హాలులో పనులు కొనసాగుతున్నాయని మక్కా మసీదు సూపరింటెండెంట్ అబ్దుల్ ఖదీర్ సిద్ధిఖీ తెలిపారు.
తాజావార్తలు
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!