స‌రికొత్త ట్రెండ్‌: పాముకాటుతో హ‌త్య‌లు…

రాజ‌స్తాన్ లో ఎవ‌రిపైనైనా కోపం ప‌గ ఉంటే వారిని పాముతో కాటు వేయించి చంపేస్తున్నారు. ఆ త‌రువాత పాము కాటుతో చ‌నిపోయిన‌ట్టు చిత్రీక‌రిస్తూ నేర‌స్తులు తప్పించుకుంటున్నారు.  ప్ర‌స్తుతం ఇదే ట్రెండ్ కోన‌సాగుతోంద‌ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీర‌మ‌ణ ధ‌ర్మాసం పేర్కొన్న‌ది.  దీనిపై ధ‌ర్మాస‌నం సీరియ‌స్ అయింది.  రాజ‌స్థాన్‌లోని జుంజుహు జిల్లాలోని ఓ గ్రామంలో సుబోద్ దేవీ అనే మ‌హిళ కుమారులిద్ద‌రూ ఆర్మీలో ప‌నిచేస్తున్నారు.  వీరిలో పెద్ద కుమారుడు స‌చిన్‌కు అల్ఫాన్సా అనే యువ‌తితో 2018 డిసెంబ‌ర్ 18 వ తేదీన వివాహం జ‌రిగింది.  ఈ వివాహం త‌రువాత స‌చిన్ తిరిగి ఆర్మీకి వెళ్లిపోయాడు.  సుబోధ్ దేవీ భ‌ర్త కూడా విధుల నిమిత్తం వేరే చోటికి వెళ్లిపోవ‌డంతో ఇంట్లో అత్త‌, కోడళ్లు ఇద్ద‌రే ఉంటున్నారు.  ఈ స‌మ‌యంలో అల్ఫాన్సాకు జైపూర్‌కు చెందిన మ‌నీష్ అనే యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.  ఆ ప‌రిచయం అక్ర‌మ సంబంధంగా మారింది.  విష‌యం అత్త‌కు తెలియ‌డంతో కోడ‌ల్ని నిల‌దీసింది.  దీంతో ప‌థ‌కం ప్ర‌కారం మ‌నీష్‌తో క‌లిసి పామును తీసుకొచ్చి అత్త‌కు కాటు వేయించారు.  పాము కాటుకు మ‌హిళ మ‌ర‌ణించ‌డంతో మొద‌ట ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించారు.  అయితే, అనుమానం వ‌చ్చిన కుటుంబ‌స‌భ్యులు కేసు వేయ‌డంతో వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.  పాముతో కాటు వేయించి హ‌త్య చేస్తున్నార‌ని, ఆ త‌రువాత దానిని పాము కాటుగా పేర్కొంటూ తప్పించుకుంటున్నార‌ని, ఈ కేసులో కూడా అదే జ‌రిగింద‌ని సుప్రీం కోర్టు అభిప్రాయ‌ప‌డింది.  నిందితుల‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది.  

Read: ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే..

-Advertisement-స‌రికొత్త ట్రెండ్‌:  పాముకాటుతో హ‌త్య‌లు...

Related Articles

Latest Articles