Site icon NTV Telugu

అప్పటి మహేష్ ట్వీట్ ఇప్పుడు వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ఇటు సినిమా రంగంలో అటు రాజకీయ రంగంలోనూ ప్రకంపనలు సృష్టించింది. అప్పుడే దానికి ఎపి స్టేట్ పొలిటికల్ లీడర్స్ నుంచి కౌంటర్స్ కూడా వచ్చాయి. వస్తున్నాయి. సినిమా వర్గాల నుంచి పవన్ కు మద్దతు బాగానే లభిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ స్పీచ్ కి మహేష్ బాబు ఎప్పుడో చేసిన ట్వీట్ రిలేటెడ్ గా ఉందని ఇప్పుడు వైరల్ చేసేస్తున్నారు. అప్పట్లో మహేష్ పవన్ ను పొగుడుతూ ఓ ట్వీట్ చేశాడు. ‘ఎవరో చెప్పగా విన్నాను. నిన్న పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకలో చాలా బాగా మాట్లాడాడు అని… అది విని ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే అతను నేను బాగా ఇష్టపడే వ్యక్తి’ అన్నదే ఆ ట్వీట్. అప్పుడు మహేష్ బాబు చేసిన ట్వీట్ నిన్న పవన్ స్పీచ్ కు సరిగ్గా అతికినట్లు సరిపోవడంతో అభిమానులు అప్పటి మహేశ్ ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు.

నిజానికి వీరిద్దరి మధ్య పలు సార్లు బాక్సాఫీస్ వార్ జరిగింది. ఒక్కో సారి ఒకరు పై చేయి అనిపించుకున్నా… ఇద్దరి మధ్య మంచి దోస్తీ ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా వీరిద్దరూ తమ సినిమాలతో పోటీపడబోతున్నారు. మహేశ్ ‘సర్కారువారి పాట’తో రాబోతుంటే… పవన్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ ‘భీమ్లా నాయక్’తో వస్తున్నాడు. మరి ఈ సారి ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

Exit mobile version