దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేసుల్లో పెరుగుదలను చూస్తుంటే థర్డ్‌వేవ్ అనివార్యమనిపిస్తోందని, ఇప్పటికే థర్డ్ వేవ్ వచ్చినట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై తో పాటు అనేక పెద్ద నగరాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనక తప్పదని, అనివార్యం అని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారని ముఖ్యమంత్రి ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనక తప్పదని అన్నారు.
Read: అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి : ఉత్తమ్
ఢిల్లీ, హర్యానా, యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో జనసాంద్రత అధికంగా ఉన్న భోపాల్, ఇండోర్ నగరాల్లో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నా, ముందుగానే మధ్యప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ అమలు చేయడంతో కేసులు కంట్రోల్‌లోనే ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో కేవలం 124 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతుందని అలసత్వం ప్రదర్శించవద్దని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.