ఆమె పీజీ చదివింది. ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. పైగా కరోనా మహమ్మారి దేశంలో విజృంభించడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త వారికి అవకాశాలు రావాలంటే కష్టమే. దీంతో ఆ యువతి కొత్తగా ఆలోచించింది. తన ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకుంది. పీజి చదివి ఆ పనిచేస్తావా అంటూ నిరాశ పరిచారు. అయినా ఆ యువతి వెనకడుగు వేయలేదు. అనుకున్న విధంగా తన ప్లాన్‌ను అమలుచేసింది.
Read: క్రిప్టో కరెన్సీని రూపొందించిన వ్యక్తి ఎవరో తెలుసా?
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలోని హెబ్రా రైల్వే స్టేషన్ దగ్గర ఓ చిన్న షాప్‌ను అద్దెకు తీసుకొని టీ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. నవంబర్ 1 వ తేదీన ఆ దుకాణాన్ని ఓపెన్ చేసింది. మొదటిరోజున వచ్చిన కస్టమర్లకు టీ ఫ్రీగా ఇచ్చింది. అంతేకాదు, ఆమె టీస్టాల్ పేరు ఆకట్టుకునే విధంగా మా ఇంగ్లీష్ ఛాయ్‌వాలా పేరును పెట్టింది. ఆ ఛాయ్ దుకాణం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. హెబ్రా రైల్వే స్టేషన్‌కు వెళ్లే వారంతా అక్కడ ఆగి ఛాయ్ తాగి వెళ్తున్నారట. దీంతో ఈ ఛాయ్ దుకాణం ఫేమస్ అయింది. ఉద్యోగం వేటలో ఫెయిల్ అయినా సంపాదించాలనే కలను ఛాయ్ దుకాణంతో నెరవేర్చుకున్నానని చెబుతోంది తుక్‌తుకీదాస్.