అచ్చెదిన్: ఏడాదిలో 306 పెరిగిన సిలిండర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం పెరుగుతూనే వున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి పెట్రోల్ ధరలు 19 సార్లు పెరిగిందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన మూడు వారాల్లో లీటర్ పెట్రోల్ పై 5 రూపాయల 7 పైసలు పెరిగింది. ఇక సెప్టెంబర్ 24 నుంచి డీజిల్ ధరలు 22 సార్లు పెరిగాయి. లీటర్ డీజిల్ పై గడిచిన మూడు వారాల్లోనే 7 రూపాయలు పెరిగింది.
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.55 పైసలుండగా.. డీజిల్ ధర రూ.104.70గా ఉంది. పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. వీటికి తోడు కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి. టమోటా ధర కాస్త తగ్గినా.. మిగిలిన కూరగాయలు, ముఖ్యంగా ఉల్లి ధర పెరగడం సామాన్యులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. గృహిణులకు వంటింట్లో కన్నీళ్ళు వస్తున్నాయి. ఎలా కొనాలి, ఎలా తినాలి అంటున్నారు.
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. 14.2 కేజీల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర 952 రూపాయలుగా వుంది. గత ఏడాది కాలంగా గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా పెరిగాయో ఒక సారి పరిశీలిస్తే దిమ్మ తిరగకమానదు. ఏడాది క్రితం 646 రూపాయలు వున్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 306 రూపాయలకు పైగా పెరిగింది. నవంబర్ నాటికి వెయ్యి రూపాయల మార్కుకి చేరడం అంత కష్టమేం కాదు. కానీ ఈ సిలిండర్ బండ మోయలేక మళ్ళీ కట్టెల పొయ్యి వెళతారేమో సామాన్యులు. మోడీజీ జర ఆలోచించండి.
ధరల పెరుగుదల ఇలా..
అక్టోబర్ 2021 Rs.952.00
సెప్టెంబర్ 2021 Rs.937.00
ఆగస్ట్ 2021 Rs.912.00
జూలై 2021 Rs.887.00
జూన్ 2021 Rs.861.50
మే 2021 Rs.861.50
ఏప్రిల్ 2021 Rs.861.50
మార్చి 2021 Rs.871.50
ఫిబ్రవరి 2021 Rs.821.50
జనవరి 2021 Rs.746.50
డిసెంబర్ 2020 Rs.746.50
నవంబర్ 2020 Rs.646.50
అక్టోబర్ 2020 Rs.646.50
సెప్టెంబర్ 2020 Rs.646.50
తాజావార్తలు
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!