వేర్వేరు వ్యక్తులతో ఎంగేజ్మెంట్… ప్రేమికుల అఘాయిత్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమించుకున్నారు. పెళ్ళిచేసుకోవాలని భావించారు. అయితే ఆ ఇద్దరిని తల్లిదండ్రులు విడదీశారు. ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో ఎంగేజ్మెంట్ చేశారు. కానీ వారి మధ్య ప్రేమ మరింత బలపడింది. పెళ్ళిచేసుకోవడానికి వీలు లేకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశారు. సకాలంలో వారిని రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కేసముద్రం మండలం కాట్రపల్లికి చెందిన ఓ ప్రేమ జంట గత మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు.
కాట్రపల్లి గ్రామానికి చెందిన గూగులోతు గణేష్, జాటోత్ లావణ్య ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరికీ ఇష్టం లేకుండా గతంలో వేర్వేరు వ్యక్తులతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఎంగేజ్మెంట్ ఇష్టంలేని వారిద్దరు రాజన్ పల్లి అడవికి వచ్చారు. వస్తూ వస్తూ పురుగుల మందు తెచ్చుకుని అక్కడే తాగేశారు. ఇది గమనించిన స్థానికులు వారి బంధువులకు సమాచారం అందించగా గూడూరు ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆ ఇద్దరినీ మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించారు. వారిద్దరికీ ప్రాణాపాయం తప్పిందని బంధువులు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!