NTV Telugu Site icon

Jagadish Shettar: కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం.. కన్నీటి పర్యంతమైన భార్య

Shettar

Shettar

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఈరోజు కాంగ్రెస్‌లో చేరిన కొన్ని గంటల తర్వాత ఆయన తన నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో జగదీష్ షెట్టర్ సతీమణి శిల్పా భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ఏడుస్తూ కనిపించారు. ఆమెను షెట్టర్ ఓదార్చడానికి ప్రయత్నించారు. మద్దతుదారులు షెట్టర్ కు అభినందనలు తెలుపుతూ నినాదాలు చేశారు. ఆయనపై కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ రేకుల వర్షం కురిపించారు.
Also Read: Shocking Murder : యూపీలో పట్టపగలే దారుణం.. యువతిని తుపాకీతో కాల్చి చంపిన దండగులు

మే 10న జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో షెట్టర్ కు బీజేపీ టికెట్ నిరాకరించింది. పోటీకి దూరంగా ఉండాలని ఆదేశించింది. దీంతో అధిష్టా నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి్ గురయిన షెట్టర్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. రోజుల తరబడి బిజెపి అగ్రనేతలతో సమావేశాలు జరిపిన తరువాత షెట్టర్ కాంగ్రెస్ లో చేరాని నిర్ణయించుకున్నారు. కర్ణాటకలోని లింగాయత్ సామాజిక వర్గానికి బలమైన నాయకుడిగా ఉన్న షెట్టర్.. తన సొంత నియోజకవర్గం హుబ్బలి-ధార్వాడ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

సీనియర్‌ నాయకుడనైన తనకు బీజేపీ టికెట్‌ ఇస్తుందని అనుకున్నాను..కానీ నాకు దక్కడం లేదని తెలియగానే షాక్‌కు గురయ్యాను అని జగదీష్ షెట్టర్ అన్నారు. ఎవరూ తనతో మాట్లాడలేదని, తనను ఒప్పించే ప్రయత్నం చేయలేదని కాంగ్రెస్‌లో చేరిన తర్వాత షెట్టర్ విలేకరులతో అన్నారు. తనకు టికెట్ నిరాకరించినప్పుడు బిజెపి నాయకత్వం తన పట్ల వ్యవహరించిన తీరు పట్ల తాను అసంతృప్తిగా ఉన్నానని షెట్టర్ అన్నారు.
Also Read:Ladakh shut down: లడఖ్ లో సంపూర్ణ బంద్.. దలైలామాకు సంఘీభావంగా నిరసన..

తాను నిర్మించిన పార్టీతో తనపట్ల దారుణంగా ప్రవర్తించారని, బలవంతంగా బయటకు పంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీలో చేరుతున్నానని షెట్టర్ ప్రకటించారు. కాగా, షెట్టర్ గతంలో ఆరు ఎన్నికల్లో విజయం సాధించారు. 2018లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ ప్రత్యర్థి మహేష్ నల్వాడ్‌ను ఓడించి 21,000 ఓట్లకు పైగా గెలుపొందారు. కాగా, కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.

Show comments