Jagadish Shettar: కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం.. కన్నీటి పర్యంతమైన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఈరోజు కాంగ్రెస్‌లో చేరిన కొన్ని గంటల తర్వాత ఆయన తన నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో జగదీష్ షెట్టర్ సతీమణి శిల్పా భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ఏడుస్తూ కనిపించారు. ఆమెను షెట్టర్ ఓదార్చడానికి ప్రయత్నించారు. మద్దతుదారులు షెట్టర్ కు అభినందనలు తెలుపుతూ నినాదాలు చేశారు. ఆయనపై కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ రేకుల వర్షం కురిపించారు.
Also Read: Shocking Murder : యూపీలో పట్టపగలే దారుణం.. యువతిని తుపాకీతో కాల్చి చంపిన దండగులు
మే 10న జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో షెట్టర్ కు బీజేపీ టికెట్ నిరాకరించింది. పోటీకి దూరంగా ఉండాలని ఆదేశించింది. దీంతో అధిష్టా నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి్ గురయిన షెట్టర్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. రోజుల తరబడి బిజెపి అగ్రనేతలతో సమావేశాలు జరిపిన తరువాత షెట్టర్ కాంగ్రెస్ లో చేరాని నిర్ణయించుకున్నారు. కర్ణాటకలోని లింగాయత్ సామాజిక వర్గానికి బలమైన నాయకుడిగా ఉన్న షెట్టర్.. తన సొంత నియోజకవర్గం హుబ్బలి-ధార్వాడ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
సీనియర్ నాయకుడనైన తనకు బీజేపీ టికెట్ ఇస్తుందని అనుకున్నాను..కానీ నాకు దక్కడం లేదని తెలియగానే షాక్‌కు గురయ్యాను అని జగదీష్ షెట్టర్ అన్నారు. ఎవరూ తనతో మాట్లాడలేదని, తనను ఒప్పించే ప్రయత్నం చేయలేదని కాంగ్రెస్‌లో చేరిన తర్వాత షెట్టర్ విలేకరులతో అన్నారు. తనకు టికెట్ నిరాకరించినప్పుడు బిజెపి నాయకత్వం తన పట్ల వ్యవహరించిన తీరు పట్ల తాను అసంతృప్తిగా ఉన్నానని షెట్టర్ అన్నారు.
Also Read:Ladakh shut down: లడఖ్ లో సంపూర్ణ బంద్.. దలైలామాకు సంఘీభావంగా నిరసన..
తాను నిర్మించిన పార్టీతో తనపట్ల దారుణంగా ప్రవర్తించారని, బలవంతంగా బయటకు పంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీలో చేరుతున్నానని షెట్టర్ ప్రకటించారు. కాగా, షెట్టర్ గతంలో ఆరు ఎన్నికల్లో విజయం సాధించారు. 2018లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ ప్రత్యర్థి మహేష్ నల్వాడ్‌ను ఓడించి 21,000 ఓట్లకు పైగా గెలుపొందారు. కాగా, కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!