టాలివుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖుషి’…’నిన్ను కోరి’ ‘మజిలీ’ ‘టక్ జగదీష్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు..మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. టీజర్, ట్రైలర్లకి కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది..
సెప్టెంబర్ 1 ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.. మొదటి రోజే కలెక్షన్స్ కు కొల్లగొట్టింది.. అంతేకాదు బాక్సఫీస్ వద్ద అదే జోరు కొనసాగుతుంది..ఈ చిత్రానికి రూ.50.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.50.55 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.34.26 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.16.29 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.. అన్ని రాష్ట్రల్లో ఇంక ఇదే జోరు కొనసాగుతుంది..
సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తున్న ఖుషి తమిళనాట మరో రికార్డ్ క్రియేట్ చేసింది. 7 కోట్ల రూపాయల వసూళ్లతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ తెలుగు మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళ ప్రేక్షకులు హీరో విజయ్ పై ఎంతగా ప్రేమ చూపిస్తున్నారో ఈ బాక్సాఫీస్ నెంబర్స్ ప్రూవ్ చేస్తున్నాయి.. ఇప్పటికి వసూళ్లు తగ్గలేదు.. ఇంకా పెరిగే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.. ఏది ఏమైనా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది..