10 రూపాయల కోడి పిల్లకి.. రూ.50 టికెట్.. ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పావలా కోడికి..ముప్పావలా మసాలా అనేది పాత సామెత. ఇప్పుడు కాస్త మార్చుకోవాలేమో.. 10 రూపాయల కోడిపిల్లకు 50 రూపాయల టికెట్. ఇది కర్నాటక ఆర్టీసీ వారి లీల. బస్సులో మనతో పాటు లగేజీ తీసుకువెళితే.. లగేజ్ టికెట్ కూడా వసూలు చేస్తాడు కండక్టర్. ఆ లగేజ్ టికెట్ ప్రయాణికుల టికెట్ తో సమానంగా వుండదు. కానీ కేఎస్ఆర్టీసీ వారి తీరే వేరు. సంచిలో కోడిపిల్లను తీసుకువెళితే కూడా టికెట్ తీసుకోవాలన్నాడా కండక్టర్. అది కూడా తక్కువేం కాదు.ఏకంగా 50 రూపాయల టికెట్ ఇచ్చాడు, దీంతో అవాక్కవ్వడం ఆ కుటుంబం వంతయింది.
కర్నాటకలో ఉత్తర కన్నడ జిల్లా సిద్ధపుర నుంచి ఓ బస్సులో ప్రయాణిస్తోంది ఓ కుటుంబం. తమతోపాటు కోడిపిల్లను తీసుకువెళ్లింది. రూ.10కి కోడి పిల్లను కొనుగోలు చేసి సంచిలో పెట్టుకున్నారు. హోసనగర నుంచి షిరూరుకు ఆర్టీసీ బస్సులో పయనమయ్యారు. హోసనగర వద్ద బస్సు ఎక్కిన వారు.. మూడు టికెట్లు కావాలని కండక్టర్‌ను అడిగారు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
అదే టైంలో సంచిలోంచి కోడి పిల్ల కిచ్ కిచ్ అని సౌండ్ చేసింది. కోడిపిల్లని బస్సు కండక్టర్ గమనించాడు. కోడిపిల్లకు కూడా టికెట్ తీసుకోవాలన్నాడు. దీంతో చేసేదేం లేక సరే అన్నారు. దానికి హాఫ్ టికెట్ తీసుకుంది ఆ కుటుంబం. రూ.10కి కోడి పిల్లను కొనుగోలు చేయగా.. రూ.50 పెట్టి దానికి టికెట్తీసుకోవడం విశేషం. కోడిపిల్ల టికెట్ తో కలిసి వారికి మొత్తం రూ.353 అయింది. ఈ వ్యవహారాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇది వైరల్ గా మారింది.దీంతో కర్నాటక ఆర్టీసీ తీరుపై కామెంట్లు పడుతున్నాయి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!