రోడ్లపై ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిక వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై అదుపుతప్పి పిఎస్సార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బళ్లారి నుండి నెల్లూరు కు వెళుతుండగా జరిగిన ప్రమాదం జరిగింది.…
నారాయణపేట జిల్లా జిలాల్ పూర్ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్ అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 17 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సేడం నుండి నారాయణపేట మీదుగా హైదరాబాద్ కు వెళ్తుండగా ఐటీఐ కాలేజి వద్ద బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు.…