ఐపీఎల్ 2021 లో ఈరోజు అభిమానులకు డబుల్ ధమాకా. అందులో భాగంగా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్ లో గెలిస్తే మొదటి స్థానానికి చేరుకుంటుంది. ఇక ఈ సీజన్ ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు తుది దశకు చేరుకోవడంతో ఇందులో విజయం సాధించి ప్లే ఆఫ్స్ కు అవకాశాలను మెరుగు పరుచుకోవాలని ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్న కోల్‌కతా భావిస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.
ఢిల్లీ : శిఖర్ ధావన్, స్మిత్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (WK/C), షిమ్రాన్ హెట్మీర్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, అవేష్ ఖాన్
కోల్‌కతా : శుబ్‌మాన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (C), నితీష్ రాణా, దినేష్ కార్తీక్ (WK), సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్