ఈరోజు ఐపీఎల్ 2021 లో మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి వచ్చిన కేకేఆర్ మొదటి నుండే విజయం వైపు సాగింది. జట్టు ఓపెనర్లు వెంకటేష్ అయ్యర్(14) ఔట్ అయిన గిల్(30) తో ఆకట్టుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (9) వెంటనే పెవిలియన్ కు చేరగా కెప్టెన్ మోర్గాన్ డక్ ఔట్ అయ్యాడు. కానీ అప్పటికే క్రీజులో కుదురుకున్న నితీష్ రాణా(31) తో నరైన్ వచ్చి నెమ్మదిగా సాగుతున్న ఛేజింగ్ కు 10 బంతుల్లో 21 పరుగులు చేసి ఉప్పందించి వెనుదిరిగాడు. ఆ తర్వాత నితీష్ మ్యాచ్ ను ముగించి జట్టుకు మరో 10 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు
అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ లో ఓపెనర్ ధావన్ (24) పరుగులు చేసి పెవిలియన్ కు చేరగా స్మిత్ 39 పరుగులతో రాణించాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లలో కెప్టెన్ రిషబ్ పంత్ ఒక్కడే 39 పరుగులతో రెండంకెల స్కోర్ ను సాధించగా మిగితా వారందరు సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం కావడంతో క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది.