బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్ షిప్ ను కిదాంబి శ్రీకాంత్ తృటిలో చేజార్చుకున్నాడు. హోరా హోరీగా జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. భారత బ్యాడ్మింటన్ హీరో కిదాంబి శ్రీకాంత్ నకు అదృష్టం కలిసి రాకపోవడంతో చివరిలో ఓడిపోయాడు.
వరుసగా 15-21, 20-22 తో రెండు గేమ్ లలో ఓటమి పాలయ్యాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో శ్రీకాంత్ మొదటి గేమ్ లో 9-3 తో ఆధిక్యం తో చెలరేగాడు. అయితే.. సింగపూర్ ఆటగాడు కిన్ యూ తర్వాత.. బ్యాట్ తో చెరరేగడంతో.. శ్రీకాంత్ కు ఓటమి తప్పలేదు. దీంతో సింగపూర్ ఆటగాడు కిన్ యూ ప్రపంచ విజేతగా నిలిచాడు.