కేబినెట్ భారీ ప్రక్షాళన.. ఏకంగా 10 మంది మంత్రులు ఔట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడమే కాదు.. తనకు నచ్చిన టీమ్, తాను మెచ్చిన విధంగా పనిచేసే టీమ్ ఉండాలని అందరు సీఎంలు కోరుకుంటారు.. ఇక, జాతీయ పార్టీలు అయితే.. వివిధ సమీకరణలు చూసుకుని మంత్రి వర్గ విస్తరణ, ప్రక్షాళన చేపడుతుంటింది.. ఇక, నాలుగు నెలల క్రితం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై.. బీజేపీ హైకమాండ్ ఆదేశాలను మంత్రి వర్గ విస్తరణపై దృష్టిసారించారు.. తన కేబినెట్లో ప్రస్తుతం ఉన్న సుమారు 10 మంది పనితీరు బాగాలేదని బొమ్మై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అటువంటివారిని సాగనంపి కొత్తవారిని తీసుకోవాలని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా ఈ మార్పులు ఉండే విధంగా ఆయన కసరత్తు చేస్తున్నారని టాక్..
Read Also: 700 మంది రైతులు అమరులైనా డేటా లేదా..?
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
అయితే.. కర్ణాటకలో ఈనెల 10వ తేదీన స్థానిక సంస్థల కోటాలో 25 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.. వాటి ఫలితాలు ఈ నెల 14వ తేదీన వెలువడనున్నాయి.. ఆ తర్వాత కేబినెట్లో కీలక మార్పులు జరగనున్నాయని సమాచారం.. కర్ణాటక కేబినెట్లో 34 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా 30 మంది మంత్రులు ఉన్నారు. దీంతో.. ఖాళీలు భర్తీ చేయడంతో పాటు.. కొంతమందిని పంపించే విధంగా కూడా కసరత్తు ప్రారంభించారు సీఎం బొమ్మై.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారం తర్వాత, బొమ్మై ఆగస్టు 4న 29 మంది మంత్రులను చేర్చుకోవడం ద్వారా తన మంత్రివర్గాన్ని విస్తరించారు.. చాలా మంది ఆశావహులతో, బొమ్మై మంత్రివర్గాన్ని విస్తరించాలని, నాలుగు ఖాళీలను భర్తీ చేయాలని ఒత్తిడిలో ఉన్నారు.. ఇక, మొదటి నుండి బీజేపీలో కొనసాగుతున్న పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు ఆగస్టులో జరిగిన మంత్రివర్గ విస్తరణతో కలత చెందారు, ఎందుకంటే వారిని తప్పించడం.. బయటివారికి ప్రాధాన్యత ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్నారు.. దీంతో.. భారీ ప్రక్షాళన ఉంటుందని.. అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జేడీ(ఎస్) ఆరుగురు అభ్యర్థులను మాత్రమే నిలబెట్టగా, బీజేపీ, కాంగ్రెస్ 20 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి పెట్టాయి. మరి ఫలితాలు ఎలా ఉంటాయో..? కేబినెట్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!