చిరకాల ప్రత్యర్ధులు అయిన భారత్ – పాకిస్థాన్ జట్లు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈ 24న తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ పైనే ప్రస్తుతం అభిమానుల దృష్టి ఉంది. అయితే తాజాగా ఈ మ్యాచ్ పై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. ఈ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్ లలో పాల్గొంటావు కాబట్టి ఈ మ్యాచ్ ఆటగాళ్ల కంటే అభిమానులకు చాలా కీలకం. ఇక ఈ భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ యువ ఆటగాళ్లకు చాలా లాభం అని అన్నాడు. ఈ మ్యాచ్ లో ఏ యువ ఆటగాడు అయిన సరే బాగా రాణిస్తే అతను ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాడు. ఒక్క మ్యాచ్ తోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంటాడు అని తెలిపాడు. అలాగే ఈ మ్యాచ్ సీనియర్ ఆటగాళ్లకు ఓ పరీక్షా అని అన్నారు. ఎందుకంటే.. ఈ మ్యాచ్ లో ఏ సీనియర్ ఆటగాడు అయిన రాణించకపోతే అతని పై తీవ్ర విమర్శలు వస్తాయని అని గుర్తు చేసాడు. ఇక ప్రస్తుతం ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే దాని పై ఇప్పటికే చర్చలు… అంచనాలు మొదలైన విషయం తెలిసిందే.