ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత జట్టుతో న్యూజిలాండ్ జట్టు రెండో టెస్ట్ లో తలపడనుంది. అయితే ఈ రెండు జట్లు తలపడిన మొదటి టెస్ట్ డ్రా కావడంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారిదే ఈ సిరీస్. దాంతో ఇందులో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు అనుకుంటున్నాయి. అందుకు తగ్గట్లుగానే మొదటి టెస్ట్ లో ఆడని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కు ముందు జట్టులో చేరి.. జట్టు బలాన్ని మరింత పెంచాడు. కానీ న్యూజిలాండ్ కు మాత్రం ఈ మ్యాచ్ కు ముందు షాక్ తగిలింది. అదేంటంటే… ఈ మ్యాచ్ కు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. మోచేయి గాయం కారణంగా కేన్ ఈ మ్యాచ్ మిస్ కానున్నాడు అని తెలిపింది. దాంతో ఈ మ్యాచ్ లో కివీస్ జట్టుకు టామ్ లాథమ్ న్యాయకత్వం వహించనున్నాడు. అయితే ప్రస్తుతం ముంబైలో పిచ్ తడిగా ఉండటంతో టాస్ ను అంపైర్లు వాయిదా వేసిన విషయం తెలిసిందే.