ప్రకృతి అంటే ఆమెకు ప్రాణం.. ఆ ప్రకృతి ప్రకోపానికే బలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకృతి అంటే ఆమెకు ఎంతో ఇష్టం.. అందుకే తరచూ వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ.. ఆ జర్నీలోని అనుభవాలను, అనుభూతులను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.. కానీ, తాను ట్వీట్ చేసిన అరగంటలోపే ఆ ప్రకృతి ప్రకోపానికే బలిఅవుతానని ఊహించి ఉండదు.. ఇప్పుడా ఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఆయుర్వేదిక్ డాక్టర్ దీప శర్మ.. ఈ సృష్టిలోని ప్రకృతి అందాలను చూసి ఎంజాయ్ చేస్తూ వచ్చారు.. ఆయుర్వేద వైద్యురాలిగా మంచి పేరు సంపాదించుకున్న ఆమెకు ప్రకృతి అంటే.. ఎంతో ప్రేమ.. ఇప్పటికే ఎన్నో ప్రదేశాలను చుట్టేశారు.. తాజాగా.. హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లి.. తిరిగి వస్తుండగా.. హిమాచల్‌ప్రదశ్‌లోని కిన్నౌర్ జిల్లా సంగ్లా-చిత్ కుల్ రోడ్డు వద్ద ఆదివారం కొండ చరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృత్యువాతపడ్డారు.. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 34 ఏళ్ల ఆయుర్వేదిక్ డాక్టర్ దీపా శర్మ.. సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఫొటోలు.. రాసిన టెస్ట్ అందరినీ కట్టిపపడేస్తోంది.
కొండచరియలు విరిగిపడిన దుర్ఘటన జరగడానికి సరిగ్గా 25 నిమిషాల ముందు ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అయిపోయింది.. సాధారణ ప్రజలకు అనుమతి ఉన్న భారతదేశపు చిట్టచివరి పాయింట్ వద్ద నేనిప్పుడు నిల్చొని ఉన్నా.. ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో చైనా అక్రమించిన టిబెట్‌తో మనకు సరిహద్దు ఉంది.. అంటూ ట్వీట్ చేశారు దీపా శర్మ.. కానీ, అదే ఆమె చివరి ట్వీట్ అయిపోయింది.. మధ్యాహ్నం 12.59 గంటల ప్రాంతంలో అక్కడి కొండల్లో ఉన్న ఇండియా-టిబెట్ బార్డర్ దగ్గర దిగిన ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.. 1.25 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగి బస్తేరీ వద్ద సంగ్లా-చిట్కుల్ రోడ్డు మీద వెళుతున్న కార్లపై పడగా.. ఓ కారులో ఉన్న దీప అక్కడిక్కడే మృతి చెందింది. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన అరగంటకే దీప కూడా మృతిచెందింది. ఇక, అంతకుముందు రోజు కొండ ప్రాంతంలో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు.. అంటూ కామెంట్ పెట్టారు దీపా శర్మ.. తనకు ప్రకృతిపై ఉన్న ప్రేమను ఈ విధంగా చాటుకున్నారు.. కానీ, ఆ ప్రకృతిలో సంభవించిన ఊహించని ఘటనలో ప్రాణాలు వదలడం విషాదంగా మారిపోయింది. దీంతో.. దీప పెట్టిన ట్విట్టర్ పోస్టులు ఇప్పుడు వైరల్ అయిపోయాయి..
Also Read
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Ireland: ఐర్లాండ్‌లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
- Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
- Congress-TMC: కాంగ్రెస్‌లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్‌తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్‌కు బొద్దింకల అల్టిమేటం..
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!