Recovering From Depression: డిప్రెషన్ నుండి ఉపశమనం ఎలా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానసిక ఒత్తిడి మనిషిని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఒత్తిడి వల్ల గెండె సంబంధిత వ్యాధ్యులు, మానసిక రుగ్మతల బారిన పడతారు. శారీరక కార్యకలాపాల్లో చురుకుగా ఉండటం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం గురించి అనేక అధ్యయనాలు వెలువడ్డాయి. కేవలం నడక అలవాటు చేసుకోవడం వల్ల కూడా మానసిక, శారీరక ఆరోగ్యంలో పెద్ద మార్పు వస్తుంది. ఇప్పుడు డిప్రెషన్‌ను అరికట్టడంలో వ్యాయామం యొక్క పాత్రను స్పష్టం చేసే ఒక అధ్యయనం బయటకు వచ్చింది. ఆస్ట్రేలియాలోని పరిశోధకులు ఈ అధ్యయనం వెనుక ఉన్నారు. డిప్రెషన్‌తో సహా మానసిక సమస్యలకు మందుల కంటే వ్యాయామం మరింత ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Also Read:Today Business Headlines 28-04-23: చేతులు మారనున్న కామసూత్ర. మరిన్ని వార్తలు
ఈ అధ్యయనం బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించబడింది. 1,28,119 మంది నుంచి డేటాను సేకరించి ఈ పరిశోధన నిర్వహించారు. 97 అధ్యయనాలు, 1039 ట్రయల్స్ తర్వాత, డిప్రెషన్‌ను తగ్గించడంలో వ్యాయామం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో పరిశోధకులు కనుగొన్నారు. డిప్రెషన్, ఆందోళన, నిస్సహాయత, గర్భిణులు, ప్రసవానంతర డిప్రెషన్‌కు గురైన వారు, హెచ్ఐవీ, కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో వ్యాయామం సానుకూల మార్పును సృష్టించిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ బెన్ సింగ్ చెప్పారు. ఫిజికల్ యాక్టివిటీస్ లో చురుగ్గా ఉండడం వల్ల డిప్రెషన్ లక్షణాలు తగ్గుతాయని తమ అధ్యయనంలో స్పష్టమైందని కూడా చెప్పారు. నడక, పైలేట్స్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు ప్రభావవంతంగా ఉంటాయని బెన్ సింగ్ చెప్పారు.
Also Read
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే మనకు కొన్ని గుండెచ, మెదడు సమస్యలు రావచ్చు. డాక్టర్, నిపుణులైన శిక్షకుల సలహాతో వ్యాయామాలు చేయవచ్చు. అందరి శరీరం ఒకేలా ఉండదు. అకస్మాత్తుగా ఏమీ చేయకుండా తీవ్రమైన వ్యాయామం చేసే రోజులో దూకడం అనారోగ్యకరం. ఇందుకు మానసిక సిద్ధత కూడా ముఖ్యం. ఏ రకమైన వ్యాయామమైనా నిదానంగా ప్రారంభించవచ్చు. వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, వివిధ ఆటలు, జిమ్ వ్యాయామాలు మొదలైనవన్నీ దశలవారీగా చేయవచ్చు. చిన్నపాటి వ్యాయామంతో కండరాలు, కీళ్లకు బలం చేకూర్చడం మొదటి దశ. జిమ్‌లో ఉంటే చిన్నపాటి వ్యాయామాలతో శరీరాన్ని సిద్ధం చేసుకున్న తర్వాతే సైకిల్, ట్రెడ్మిల్ వంటి వాటికి వెళ్లాలి.
Also Read:PM Modi: రామగుండం రిలే స్టేషన్.. జాతికి అంకితం చేయనున్న ప్రధాని
రక్తపోటు, గుండె సమస్యలు మొదలగునవి సంభవించవచ్చు. మహిళల్లో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మీ డాక్టర్, శిక్షకుడు లేదా ఫిజియోథెరపిస్ట్‌తో మాట్లాడిన తర్వాత, మీరు సరైన వ్యాయామ దినచర్యలోకి ప్రవేశించవచ్చు. వ్యాయామానికి ముందు వేడెక్కడం తప్పనిసరి. అవయవాలకు స్ట్రెచింగ్ ఇవ్వాలి. ఐదు నిమిషాల వార్మప్ తర్వాత, మీరు వ్యాయామం ప్రారంభించవచ్చు. వర్కవుట్కు ముందు ప్రీవర్క్ అవుట్ మీల్స్ తినవచ్చు. తియ్యని పండు లేదా రసం తీసుకోవాలి. మొదటి దశలో శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా మార్చే వ్యాయామాలు చేయాలి. తర్వాత తీవ్రమైన బరువు తగ్గించే వ్యాయామాలు చేయడం ప్రారంభించండి. అధిక బరువు ఉన్నవారు వ్యక్తిగత శిక్షకుని దగ్గర శిక్షణ తీసుకోవడం మంచిది. వ్యాయామం, ఆహారం గురించి సరైన సలహా పొందడం మంచిది. వ్యాయామం చేసేటప్పుడు అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలి, దాహం వేస్తే సరిపడా నీళ్లు తాగాలి.
తాజావార్తలు
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!