తెలుగు రాష్ట్రాలను వర్షాలు కుదిపేస్తున్నాయి. అయితే.. గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తాజాగా ఏపీకి నేడు, రేపు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భ నుంచి ఉపరితల అవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల శుక్రవారం, శనివారం వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తా, సీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ఏపీ జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. వర్షం పడుతున్నప్పుడు పిడుగులు పడే అవకాశముందని చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ఎవరు కూడా చెట్ల కిందకు వెళ్లొద్దని తెలిపారు. రైతులు, కూలీలు, గొర్రెలకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read : Unemployment protest: నిరుద్యోగ నిరసన సభ.. విద్యార్థులతో రేవంత్‌రెడ్డి సమావేశం
ఇదిలా ఉంటే.. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. రెండ్రోజులపాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది వాతావరణ శాఖ. ఉత్తరాది జిల్లాలు, తూర్పు ప్రాంతంలోని మరికొన్ని జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ.
Also Read : Health Tips: పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకండి!