వ్యూహం మార్చిన ‘గులాబీ’ బాస్.. హుజూరాబాద్ రీ సర్వే ఏం తేల్చనుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే యావత్ తెలంగాణ ప్రజల దృష్టి నెలకొంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీల నేతలంతా హుజూరాబాద్ కేంద్రంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ లో ఇప్పటికే ఓసారి సర్వే నిర్వహించిన అధికార పార్టీ మరోసారి సర్వే చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గులాబీ బాస్ ఆదేశాలతో సర్వే ఏజెన్సీలు, నిఘా వర్గాలు మరోసారి రంగంలోకి దిగి రీ సర్వే చేపడుతున్నాయి. ఈ నివేదిక ఆధారంగానే గులాబీ బాస్ పర్యటన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉండనుందనే టాక్ విన్పిస్తోంది.
హుజూరాబాద్ లో ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే నెలకొంది. ఈ ఉప ఎన్నిక సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా మారడంతో ఇరుపార్టీలు నువ్వా.. నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండటం ఈ రెండు పార్టీల అభ్యర్థులకు కలిసి రానుంది. అదే సమయంలో ఇరు ప్రభుత్వాలపై ప్రజల్లోనూ కొంత వ్యతిరేకత ఉందని స్పష్టమవుతోంది. ఈ ఉప ఎన్నిక ఏ ప్రభుత్వంపై ఎక్కువ వ్యతిరేకత ఉందో తేల్చే అవకాశం సైతం కన్పిస్తోంది. ఈనేపథ్యంలోనే టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య కొద్దిరోజులుగా మాటలయుద్ధం నడుస్తోంది.
Also Read
ఇలాంటి సమయంలోనే గులాబీ బాస్ హుజూరాబాద్ నియోజకవర్గంలో రీసర్వేకు ఆదేశించినట్లు తెలుస్తోంది. పోలింగ్ తేదికి సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్ల మనోగతం తెలుసుకునేలా మరోసారి సర్వే చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారట. ఈమేరకు సర్వే ఏజెన్సీలు, నిఘా వర్గాలను క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి గ్రామస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసే వారి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే వ్యతిరేక ఓటుతోపాటు ఇతర పార్టీలకు అనుకూలంగా ఉన్న అంశాలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సర్వే తయారు చేసి రిపోర్టును అందజేయనున్నారు.
ఈ సర్వే ఫలితాల ఆధారంగా తదుపరి కార్యక్రమాలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టనున్నారు. హుజూరాబాద్ లోని ఆయా వర్గాల వారీగా వివరాలను తెలుసుకొని వ్యూహాలు రచించనున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగానే సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు నియోజకవర్గంలో పర్యటించాలనేది కూడా డిసైడ్ కానుందని సమాచారం. ప్రచారంలో ఎలాంటి మార్పులు చేయాలి? ఓటర్లను ఆకర్షించేలా ఎలాంటి హామీలు ఇవ్వాలనేది కూడా ఈ సర్వే రిపోర్టు ఆధారంగానే చేయనున్నారు. పోలింగ్ తేది దగ్గర పడుతుండటంతో వీలైనంత త్వరగా సర్వేను పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్లాని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక అధికార పార్టీలో ఒకింత హీట్ ను పుట్టిందనేది మాత్రం స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!