ఆ సమస్య పరిష్కరానికి రూ. 5971 కోట్లు చెల్లించేందుకు సిద్దమైన ట్విట్టర్ 

మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్ సంస్థ తనపై ఉన్న కేసును పరిష్కరించుకోవాడానికి ముందుకు వచ్చింది.  ట్విట్టర్ వినియోగదారుల సంఖ్యను ఎక్కువ చేసి చూపించిందని, పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు 2014లో ఇలా తప్పుడు లెక్కలు చూపిందని 2016లో డోరిస్ షెన్ విక్ కోర్టులో కేసును ఫైల్ చేశాడు.  దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతున్నది.  అయితే, ఈ కేసును పరిష్కరించుకోవడానికి ట్విట్టర్ సిద్ధం అయ్యింది.  ఈ కేసు పరిష్కారం కోసం రూ. 5971 కోట్ల రూపాయలు చెల్లిస్తామని ట్విట్టర్ పేర్కొన్నది.  2021 నాలుగో త్రైమాసికంలో ఈ మొత్తాన్ని చెల్లిస్తామని ట్విట్టర్ పేర్కొన్నది.  ప్రస్తుతం కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందువలన కోర్టు దీనికి ఒప్పుకుంటే చెల్లింపులు చెల్లిస్తామని ట్విట్టర్ ప్రతినిధులు పేర్కొన్నారు.  

Read: వారికి ఆ షరతులు వర్తించవా?

-Advertisement-ఆ సమస్య పరిష్కరానికి రూ. 5971 కోట్లు చెల్లించేందుకు సిద్దమైన ట్విట్టర్ 

Related Articles

Latest Articles