పాత పంథాలోకి సమంత… ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగచైతన్యతో విడాకుల అనంతరం హీరోయిన్ సమంత జోరు పెంచుతోంది. పలు సినిమాలను అంగీకరించడమే కాకుండా మళ్లీ పాత పంథాలోకి వెళ్లి కమర్షియల్‌గా ఐటమ్ సాంగులకు సైతం ఓకే చెప్పేస్తోంది. తాజాగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ సినిమాలో ఓ ఐటం సాంగ్ కోసం సమంతను సంప్రదించగా ఆమె ఓకే చెప్పేసినట్లు ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది. నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకునేది. మంచి పాత్రలను మాత్రమే అంగీకరించేది. రాజుగారి గది-2, ఓ బేబీ, మజిలీ వంటి సినిమాలలో సమంత క్యారెక్టర్ చాలా సున్నితంగా, మనసుకు హత్తుకునేలా ఉంటుంది.
Read Also: ఎన్టీఆర్ షోలో రూ.కోటి గెలుచుకున్న తెలంగాణ బిడ్డ
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
చైతూతో వివాహానికి ముందు పలు సినిమాల్లో సమంత గ్లామరస్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత మళ్లీ కమర్షియల్ జోన్లోకి వెళ్లిపోతోంది. ఇందులో భాగంగానే ‘పుష్ప’లో ఐటం సాంగ్‌కు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ చిత్రీకరణ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారు. వచ్చేవారం నుంచి ఈ సాంగ్ షూటింగ్ జరగనుంది. అల్లు అర్జున్‌తో గతంలో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సమంత నటించింది. ఇప్పుడు బన్నీతో కలిసి ఐటమ్ సాంగ్ చేయబోతోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ‘పుష్ప పార్ట్-1’ విడుదల కానుంది.
తాజావార్తలు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!