ఒమిక్రాన్‌ వేరియంట్ పై డ‌బ్ల్యూహెచ్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని… తీవ్ర లక్షలు కలిగిస్తుందనే ఆధారాలు లేవంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డ‌బ్ల్యూహెచ్ ఓ. అందువల్ల ఒమిక్రాన్‌ వేరియంట్‌ గురించి అర్థం చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వ్యాక్సీన్‌ తీసుకున్న వాళ్లకు సైతం ఒమిక్రాన్‌ సోకుతున్నా… రోగులకు రక్షణ కొనసాగుతుందని తెలిపింది.

అన్ని రకాల వేరియంట్లపై వ్యాక్సీన్లు సమర్థవంతంగా పనిచేశాయని ఇప్పటికే రుజువైందని వివరించింది. కాగా.. మ‌న ఇండియా లో కూడా ఈ కొత్త వేరియంట్ వ్యాపించిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం మ‌న దేశంలో.. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సంఖ్య 23 కు చేరింది. అత్యధికంగా ముంబై లో 10 గా న‌మోదైంది.

Related Articles

Latest Articles