Lectrix NDuro: 120KM రేంజ్‌తో Lectrix NDuro ఎలక్ట్రిక్ స్కూటర్.. రోజూ ఆఫీస్, కాలేజీకి వెళ్లేవారికి బెస్ట్ ఛాయిస్
- Lectrix NDuro ఎలక్ట్రిక్ స్కూటర్
- రోజూ ఆఫీస్, కాలేజీకి వెళ్లేవారికి బెస్ట్ ఛాయిస్
- Lectrix NDuro 2.0 - రూ. 87,550 (ఎక్స్-షోరూమ్)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజూ ఆఫీస్, కాలేజీ లేదా ఇతర పనుల కోసం ప్రయాణించే వారికి తక్కువ ఖర్చుతో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే Lectrix NDuro మంచి ఎంపికగా నిలుస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్, 120 కిలోమీటర్ల వరకు రేంజ్, స్మార్ట్ ఫీచర్లు, వేగవంతమైన ఛార్జింగ్‌తో ఈ స్కూటర్ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది. Lectrix NDuro రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. Lectrix NDuro 2.0 – రూ. 87,550 (ఎక్స్-షోరూమ్). Lectrix NDuro 3.0 – రూ. 1.02 లక్షలు (ఎక్స్-షోరూమ్). తక్కువ ధరలో మంచి రేంజ్ కోరుకునేవారికి NDuro 2.0, ఎక్కువ రేంజ్, అదనపు ఫీచర్లు కావాలనుకునేవారికి NDuro 3.0 అనుకూలంగా ఉంటుంది.
బ్యాటరీ, రేంజ్
Lectrix NDuro 2.0లో 2.3kWh లిథియం-అయాన్ బ్యాటరీను అందించారు. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. Lectrix NDuro 3.0లో 3kWh బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌తో 120 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్కూటర్‌ను ఛార్జ్ చేయడానికి ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ అవసరం లేదు. ఇంట్లోని సాధారణ వాల్ సాకెట్‌కు కనెక్ట్ చేసి ఛార్జ్ చేయవచ్చు. పూర్తి ఛార్జింగ్ సమయం: సుమారు 4.5 గంటలు.
Also Read
- Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
- 100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
పనితీరు
రెండు వేరియంట్లలోనూ 1.2kW ఎలక్ట్రిక్ మోటార్ ను అందించారు. ఈ మోటార్ వేగంగా స్పందిస్తూ స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. గరిష్ట వేగం: 65 కిమీ/గంట
0 నుంచి 40 కిమీ/గంట: కేవలం 5.1 సెకన్లు. అంతేకాకుండా, మోటార్‌కు IP67 రేటింగ్ ఉంది. దీంతో వర్షాకాలంలో లేదా నీటితో నిండిన రోడ్లపై కూడా మెరుగైన రక్షణ లభిస్తుంది.
మూడు రైడింగ్ మోడ్లు
రైడింగ్ అవసరాన్ని బట్టి మూడు మోడ్‌లను ఎంచుకోవచ్చు. Eco Mode, Normal Mode, Sport Mode
స్మార్ట్ ఫీచర్లు
5-అంగుళాల డిజిటల్ డిస్ప్లే
బ్లూటూత్ కనెక్టివిటీ
టర్న్-బై-టర్న్ నావిగేషన్
LED హెడ్‌లైట్
LED టెయిల్‌లైట్
స్మార్ట్‌ఫోన్‌ను స్కూటర్‌తో కనెక్ట్ చేసి నావిగేషన్ వివరాలను నేరుగా డిస్ప్లేపై చూడవచ్చు. ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో హైడ్రాలిక్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు అందించారు. అలాగే 12-అంగుళాల ట్యూబ్ టైర్లు మెరుగైన గ్రిప్, స్థిరత్వాన్ని అందిస్తాయి. లో మెయిన్ టెనెన్స్ కాస్ట్, మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవంతో Lectrix NDuro రోజూ ఆఫీస్ లేదా కాలేజీకి వెళ్లే వారికి మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంపికగా చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!