పసిడి ప్రియుకులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. ఈ రోజు మాత్రం పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.200 మేర పెరిగింది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.220 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.54,700కి చేరింది. ఇక, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,670కి ఎగసింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670 లుగా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర మాత్రం ఈ రోజు స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.75,700 వద్ద కొనసాగుతోంది.
Also Read: Pakistan Crisis: పాక్ లో గోధుమ సంక్షోభం..పిండి కోసం ట్రక్కును వెంబడించిన వందలాది మంది.. వీడియో వైరల్..
ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,820గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,450గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,490కి చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,720గా కొనసాగుతోంది.