Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Godavari Districts Ready For Pongal Cock Fights

కోడి పందాలకు బరులు సిద్ధం.. మరి పోలీసులేం చేస్తారో?

Published Date :January 11, 2022 , 5:03 pm
By NTV WebDesk
కోడి పందాలకు బరులు సిద్ధం.. మరి పోలీసులేం చేస్తారో?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లు కాళ్లు దువ్వుతాయ్. ఇది కొందరికి సంప్రదాయం. మరికొందరికి పండుగ పూట వినోదం.. ఇంకొందరికి దండిగా ఆదాయం సమకూరే మార్గం. ఆనవాయితీ ముసుగులో ఇదే వేదికగా ఇతర జూదాలకు దిగుతున్నారు.ఏటా సంక్రాంతికి కోట్లలో చేతులు మారుతుండడం రివాజుగా మారుతోంది. అడ్డుకుంటామని పోలీసులు అంటుంటే..ఆడించి తీరుతామని నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. సవాళ్లు..ప్రతి సవాళ్ల మధ్య రెండు జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాలపై ఉత్కంఠ నెలకొంది.

తెలుగు లోగిళ్లలో పెద్ద పండగ సంక్రాంతి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో సంబరాలు మొదలయ్యాయి. మూడు రోజులు ఘనంగా జరుపుకునే ఈ పండగ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు. సంక్రాంతి రోజుల్లో గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతుంటాయి. పందెంరాయుళ్లు కోళ్లకు కత్తులు కట్టి బరిలో దింపడానికి ఇప్పటికే రెడీ అయిపోయారు.

సర్కారు హెచ్చరిస్తున్నా..న్యాయస్థానాలు వద్దని వారిస్తున్నా..పోలీసులు కేసులు పెడుతున్నా..పెడచెవిన పెడుతున్నారు పందెంరాయుళ్లు. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు బరులు సిద్ధం అయ్యాయి. రెండు జిల్లాల్లో సంక్రాంతికి బెట్టింగ్ బంగార్రాజులు కోళ్లతో రెడీ అయిపోయారు. రెండు జిల్లాల పోలీసులు మాత్రం పందెంరాయుళ్లపై కన్నెర్రజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందాలను జరగనివ్వబోమని వార్నింగ్‌ ఇస్తున్నారు పోలీసులు.

ఖాళీ స్థల్లాల్లో కోళ్లను పందాలకు సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. కోనసీమలోని ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, వల్లంకుర్రు మండలాల్లో సంప్రదాయం ముసుగులో కోడి పందాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దాపురం, కాకినాడ రూరల్, పిఠాపురం, కిర్లంపూడి, మల్లిశాల, జగ్గంపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తుంటారు. మరోవైపు పండగలకు ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి చుట్టాలు, స్నేహితుల పేరుతో జిల్లాకు వచ్చిన వారు ముందస్తుగా లాడ్జిల్లో రూమ్‌లు బుక్ చేసుకుంటున్నారు.

ఏళ్ల తరబడి నాలుగు రోజుల పాటు కోడిపందాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. బరుల నిర్వాహకులు కొందరు చిన్నా..పెద్దా నాయకులను కలిసి అనుమతికి ఒప్పించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. బరుల నిర్వహణపై చూసీచూడనట్లు వదిలేయాలనే ఒత్తిడి పెరిగింది. రాజకీయాలకు అతీతంగా ఒక్కటై కోడిపందేలకు సై అంటున్నారు. కొందరు స్థానిక అధికారులను మచ్చిక చేసుకుంటున్నారు. మరికొందరిని ఒత్తిళ్లతో బెదరగొడుతూ బరుల జోలికి రాకుండా చక్రం తిప్పుతున్నారు.

పందాల కోసం జిల్లాలకు కోట్లాది రూపాయలు చేరినట్టు తెలుస్తోంది. కోడి పందాలకు ముందు లక్షలాది రూపాయలు ప్రచారం పేరుతో పోలీసులు ఖర్చు చేయడం షరా మామూలుగానే మారుతోంది. పోలీసుల ఆంక్షలు..పందెంరాయుళ్లు పట్టువీడకపోతుండటంతో రెండు జిల్లాల్లోనూ ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

కోడి పందాల స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు జిల్లాల్లోనూ బరులను ఎక్కడికక్కడే ధ్వంసం చేస్తున్నారు. చట్ట వ్యతిరేక పనులను ఉపేక్షించబోమని తేల్చి చెబుతున్నారు ఖాకీలు. పోలీసులు ఎన్ని రకాల ఆంక్షలు విధించినా…తగ్గేదే లే అంటున్నారు పందెం రాయుళ్లు. నిర్వాహకులు కూడా గుట్టు చప్పుడు కాకుండా పందాలకు రెడీ అయిపోతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cock fight
  • crores of rupees
  • east godavari
  • gambling
  • kodi pandalu

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions