Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- రెండుసార్లు విషపు ఇంజెక్షన్ ఇచ్చిన బతికిన మహిళా ఖైదీ..
- ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన క్రిస్టా పైక్ మరణశిక్ష విధింపు..
- ఎలా బతికిందనే దానిపై అనేక ఊహాగానాలు, థియరీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Christa Pike: అమెరికాలో టెన్నెసీ రాష్ట్రంలో ఒక మహిళకు మరణశిక్ష ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్య కేసులో దోషిగా తేలిన ఖైడీ క్రిస్టా పైక్‌కు మరణశిక్ష అమలు చేసేందుకు 2 సార్లు ప్రాణాంతక విషపు ఇంజెక్షన్లు ఇచ్చినా ఆమె బతికే ఉండటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరణశిక్ష విధింపు ప్రక్రియ సమయంలో ఇంజెక్షన్లు ఇచ్చినా, ఆమె మరణించకపోవడంతో తిరిగి ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె స్పృహలోకి వచ్చిందని ఆమె న్యాయవాదులు తెలిపారు.
ఎలా బతికింది..?
పెంటోబార్బిటాల్ అనే విషపు ఇంజెక్షన్ శరీరంలోకి వెళ్లినా ఎందుకు మరణించలేదనే ప్రశ్న అందర్ని తొలిచివేస్తోంది. కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించే ఈ ఇంజెక్షన్ పైన్ విషయంలో మాత్రం పనిచేయలేదు. ఈ మందు ఆమె శరీరంలోకి వెళ్లిందా? వెళ్లినా రక్తంలోకి తగిన మోతాదులో చేరిందా? అనే అనుమానాలు వస్తున్నాయి.
Also Read
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
నరాల్లోకి ఇంజెక్షన్ వెళ్లలేదా?
అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ జోయెల్ జివోట్ ప్రకారం.. పైక్‌కు ఇచ్చిన పెంటోబార్బిటాల్ పరిమాణం సాధారణంగా రక్త ప్రవాహంలోకి సరిగా చేరితే ప్రాణాంకతంగా మారుతుందని చెప్పారు. కానీ ఇంజెక్షన్ ఇచ్చిన ప్రాంతంలో పైక్ చేతులపై తీవ్రమైన వాపు, కాలిన గాయాలు కనిపించాయి. బొబ్బలు ఏర్పడ్డాయి. దీనిని బట్టి చూస్తే మందు నరాల్లోకి కాకుండా పక్కనే ఉన్న కణజాలంలోకి చేరి సంకేతాలు ఉన్నట్లు భావిస్తున్నారు. నరాల్లోకి చేరకుండా కణజాలంలోకి వెళ్తే రక్తంలో మందు ఒకేసారి చేరక ప్రాణం పోదని చెబుతున్నారు.
క్రిస్టా పైక్ ఉన్న ఈ సమస్యే కాపాడిందా?
క్రిస్టా పైక్‌కు ‘‘థ్రాంబోసైటోసిస్’’ అనే పరిస్థితి ఉందని ఆమె న్యాయవాదులు చెబుతున్నారు. ఇందులో రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుంది. ప్లేట్లెట్లు రక్తం గడ్డకట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంజెక్షన్ ప్రాంతంలో క్లాటింగ్ సమస్య ఏర్పడి ఉంటే, మందు రక్తంలోకి సరిగా చేరకుండా ఉండే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
మందు నాణ్యతపై అనుమానాలు..
పైక్‌కు ఉపయోగించిన మందు నాణ్యతపై కూడా అనుమానాలు ఉన్నాయి. పెంటోబార్బిటాల్ మందు తయారీ, నిల్వ సమయంలో దెబ్బతిన్నదా? అనే సందేహాలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!