గోవా ప్రభుత్వం ఇటీవలి ఉత్తర్వులను సవరించడం ద్వారా రాష్ట్రంలోని వన్యప్రాణుల అభయారణ్యం లోపల ఉన్న 14 జలపాతాలను సందర్శించడానికి అనుమతించింది. దక్షిణ గోవా జిల్లాలోని మైనాపి జలపాతంలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోవడంతో జలపాతాలు, వన్యప్రాణుల అభయారణ్యాల పరిసరాల్లోకి సందర్శకుల ప్రవేశాన్ని అటవీ శాఖ గత వారం నిషేధించింది. దక్షిణ గోవా జిల్లాలోని మైనాపి జలపాతంలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోవడంతో జలపాతాలు, వన్యప్రాణుల అభయారణ్యాల పరిసరాల్లోకి సందర్శకుల ప్రవేశాన్ని అటవీ శాఖ గత వారం నిషేధించింది.
దీంతో పర్యాటక అప్పటి నుంచి గోవాకు పర్యాటకుల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు.. ఈ క్రమంలో మంగళవారం, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్డర్‌ను సవరించారు, సత్తారి (ఉత్తర గోవా జిల్లా), ధర్బండోరా, సంగూమ్, కెనకోనా తాలూకాలలో (అన్నీ దక్షిణ గోవాలో) 14 తక్కువ ప్రమాదాలు కలిగిన లోతు లేని జలపాతాలను పర్యాటకులు సందర్శించడానికి ప్రభుత్వం అనుమతించారు..
ఈ జలపాతాలు తక్షణం అమల్లోకి వచ్చేలా ప్రజలకు అనుమతి ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
సందర్శకులు జలపాతాలను వీక్షించేందుకు సమీపంలో నియమించబడిన ఎంట్రీ పాయింట్ల వద్ద టిక్కెట్లు కొనుగోలు చేయాలి. సందర్శకులందరూ వారి స్వంత భద్రత కోసం అటవీ శాఖ సూచించిన నియమాలు మరియు నిబంధనలను పాటించాలి వన్యప్రాణులకు ఎటువంటి భంగం కలగకుండా ఉండాలి అని గోవా ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేసింది… ఈ వార్త విన్న పర్యాటకులు గోవా బయలుదేరడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.. ఏది ఏమైనా గోవా అందాలు గురించి ఎంత చెప్పినా తక్కువే.. మీరు వెళ్లాలనుకుంటే అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ ను చూడటం మర్చిపోకండి..