2015 నుంచి 2021 వరకు ఏడేళ్ల కాలంలో వాతావరణంలో అనేక మార్పులు సంభవించాయి. పొల్యూషన్ రోజురోజుకు పెరిగిపోతున్నది. గ్లోబలైజేషన్ గ్లోబల్ వార్మింగ్‌కు దారితీసింది. 2021లో 1.09 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయని, ఈ ఏడాది ప్రారంభంలో ఎన్ నిలా కారణంగా ఉష్ణోగ్రతలు కొంతమేర తక్కువగా నమోదవుతున్నప్పటికీ, రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితులు ఉండబోవని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read: ఢిల్లీలో పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం… రికార్డ్ స్థాయిలో కొనుగోళ్ళు…
దృవ ప్రాంతాల్లో వేడి పెరగడం వలన మంచు కరిగిపోతున్నది. కొన్ని చోట్ల సముద్ర నీటిమట్టం పెరగ్గా,కొన్ని చోట్ల సముద్రం ముందుకు వచ్చింది. 2021 నాటి పరిస్థితులు కంటిన్యూ అయితే, 2100 నాటికి సముద్రమట్టాల స్థాయి 2 మీటర్ల మేర పెరిగే అవకాశం ఉన్నది. అదే జరిగితే, ప్రపంచంలో 63 కోట్ల మంది నిర్వాసితులు అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని నివారించాలంటే ప్రపంచంలో పొల్యూషన్‌ను కట్టడి చేయాల్ని ఉన్నది.