పాకిస్తాన్ జరిగే మ్యాచ్‌కు…టీమిండియా కూర్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. మెంటార్ అవతారమెత్తిన ఎంఎస్ ధోని…తన మార్క్‌ను చూపిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్ కేఎల్ రాహుల్…ఫుల్ ఫామ్‌లో ఉండగా…వార్మప్ మ్యాచ్‌ల్లో హిట్ మ్యాన్ బ్యాట్ ఝులిపించాడు. పేస్ బౌలర్లుగా బుమ్రా, మహ్మద్ షమీలకు చోటు దక్కే ఛాన్స్ ఉంది. స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్‌లు కీలకంగా మారనున్నారు. తుది జట్టులో చోటు కోసం భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలనుకుంటే…శార్దూల్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. తుది జట్టులో కోహ్లీ, రోహిత్ శర్మ, రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఉండే అవకాశం ఉంది. దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ లేదా శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, బుమ్రాలకు ఉండే ఛాన్స్ ఉంది.