ఉలిక్కిపడ్డ దేశ రాజధాని… ఢిల్లీ కోర్టులో పేలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ గురువారం నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత కట్టుదిట్టంగా భద్రత ఉండే కోర్టులో పేలుడు సంభవించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఢిల్లీలోని రోహిణి కోర్టులో గురువారం ఉదయం కోర్టు కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారి పేలుడు చోటుచేసుకుంది. దీంతో కోర్టు పరిసరాల్లో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పేలుడుకు గల కారణాలపై విశ్లేషించారు. ఓ గదిలో ఉన్న బ్యాగులోని ల్యాప్‌టాప్ పేలిందని.. ల్యాప్‌టాప్‌లోని బ్యాటరీలే పేలుడుకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించామన్నారు.
Read Also: కోహ్లీకి వన్డే కెప్టెన్సీ పోవడానికి ఆ 48 గంటలే కారణమా?
Also Read
కాగా ఉదయం 10:30 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించిందని.. భారీగా శబ్ధం వినిపించడంతో అందరూ బాంబు అని భయపడిపోయారని అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే కోర్టు కార్యకలాపాలు అన్నీ నిలిపివేశామన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎన్ఎస్జీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ల్యాప్‌టాప్ పేలిందని తెలుసుకున్న స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ల్యాప్‌టాప్ పేలి నేలపై పడిఉన్న వీడియోలు, ఫోటోలను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
తాజావార్తలు
-
Ponguleti Srinivas : తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు.. కేంద్రానికి మంత్రి పొంగులేటి బిగ్ రిక్వెస్ట్..
-
Anupama: మౌనం వీడిన అనుపమ: టాక్సిక్ రిలేషన్‌షిప్‌పై సంచలన వ్యాఖ్యలు
-
Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Mythri Ravi : Fauzi ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా జరగదు..అది వేరే లెవెల్ లో ఉంటది!
-
Iran-Trump: ట్రంప్ టర్కీ టూర్లో ఇరాన్ ఇంత ప్లాన్ చేసిందా? వెలుగులోకి సంచలన కథనం
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..