హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత 5 నెలల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఉప ఎన్నికల నోటిషికేషన్ వచ్చిననాటి నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి ప్రజలను ఎంతవరకు ఒప్పించారనేది ఈ రోజుతో తేలనుంది. ఓటర్లు మెచ్చిన లీడర్ ఎవరో నేటి ఓట్ల లెక్కింపుతో బయట పడనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేశారు.
పోలింగ్ అనంతరం ఈవీఏంలను కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. అయితే ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభం కానుంది. దీని కోసం రెండు కౌంటింగ్ హాల్‌లను ఏర్పాటు చేయగా, ఒక్కో హాల్లో 7 టేబుల్ల చొప్పున ఏర్పాటు చేశారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానున్నారు. ఒక్కో రౌండ్లలో సుమారు 9 వేల నుంచి 10 వరకు ఓట్ల లెక్కింపు జరుగనుంది.
Also Read
ఒక్కో రౌండ్ లెక్కింపుకు 30 నిమిషాల సమయం పడుతుంది అధికారులు చెబుతున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ తర్వాత హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలపూర్ మండలాల ఓట్లను లెక్కించనున్నారు. హుజురాబాద్‌లో ఉప ఎన్నికలో 2లక్షల 5 వేల 236 ఓట్లు పోల్ అయ్యాయి. కౌంటింగ్ సెంటర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడెంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. అలాగే కౌంటింగ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!