చైనాలో రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్ గ్రాండే పెద్ద 300 బిలియన్ డాలర్ల ఎప్పుతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏ క్షణంలో అయినా ఈ కంపెనీ దివాళా తీసే అవకాశం ఉండటంతో చైనాలోని రియల్ ఎస్టేట్ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వాటిని ఉపసంహరించుకుంటున్నారు. దీంతో ఓ వెలుగు వెలిగిన దిగ్గజ రియల్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుదేలయ్యారు. లక్షల కోట్ల రూపాయలు క్షణాల వ్యవధిలో హాం ఫట్ అయ్యింది. చైనాకు చెందిన సివిక్ హోల్డింగ్ గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని సంపద గంటల వ్యవధిలో రూ.7300 కోట్లు నష్టపోయాడు. సోమవారం ఉదయం 1.3 బిలియన్లుగా ఉన్న జాంగ్ యునాన్ లింగ్ సంపద మధ్యాహ్నం కల్లా కేవలం 250.7 మిలియన్ డాలర్లకు చేరింది. చైనాలో వరసగా రియల్ ఎస్టేట్ కంపెనీలు నష్టాలు ఎదుర్కొంటుండటంతో ఇన్వెస్టర్లు ఇతర రంగాలపై దృష్టిసారిస్తున్నారు.
Read: ఇండియా కరోనా అప్డేట్: ఈరోజు కేసులు ఎన్నంటే…