ఇండియా కరోనా అప్డేట్: ఈరోజు కేసులు ఎన్నంటే…

ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.  తాజాగా దేశంలో 26,964 కేసులు నమోదయ్యాయి.  గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 383 మంది మృతి చెందారు.  దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,27,83,741 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.  దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,45,768 మంది మృతి చెందారు.  దేశంలో 3,01,989 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.  కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాల్సిందే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.  ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం 82,65,15,754 మందికి టీకాలు వేశారు.  

Read: మోడీ అమెరికా టూర్ షెడ్యూల్ ఇదే…

-Advertisement-ఇండియా కరోనా అప్డేట్:  ఈరోజు కేసులు ఎన్నంటే...

Related Articles

Latest Articles