వాయుగుండం ఎఫెక్ట్.. తమిళనాడు సర్కార్ అత్యవసర ఉత్తర్వులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాయుగుండం ప్రభావంతో తమిళనాడు సర్కార్ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది.. చెన్నై నగరంలో ఉన్న అన్ని సబ్‌వేలను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. మరో రెండు రోజులపాటు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.. ప్రజలు ఎవరు బయటికి రావొద్దని సూచించారు. ఇక, లోతట్టు ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వరద ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు అధికారులు..
కాగా, చెన్నైకి 170 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.. సాయంత్రానికి మహాబలిపురం, చెన్నై సమీపంలో వాయుగుండం తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.. ఇక, వాయుగుండం ప్రభావంతో.. రానున్న నాలుగు గంటల్లో చెన్నై, తిరువల్లూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని.. తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు.. ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అత్యధికంగా తాంబరంలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఎన్నూరులో 20, చోళవరంలో 20, నుంగంబాకంలో 16 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
Also Read
తాజావార్తలు
-
Chicken and Egg Prices: నాన్‌వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!