లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. చూడగానే కొంతమంది ప్రేమలో పడిపోతుంటారు. ప్రేమించిన వారిని వినూత్నంగా ప్రపోజ్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. మనుషులకు మాట ఉంటుంది. తన ఆలోచన ఉంటుంది. ఎదుటి వారికి ఎలా ప్రపోజ్ చేయాలనే తపన ఉంటుంది. మరి జంతువులైతే వాటి ప్రేమను ఎలా ప్రపోజ్ చేస్తాయి అంటే చెప్పడం కష్టమే. కొన్ని జంతువులు వాటి చేష్టల ద్వారా ప్రపోజ్ చేయడం చూస్తుంటాం. మరి ఎనుగులో ఎలా ప్రపోజ్ చేసుకుంటాయి.
Read: ఒమిక్రాన్ వేరియంట్‌పై ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు…
మగ ఏనుగులు ఆడ ఏనుగుకు ఎలా ప్రపోజ్ చేస్తుంది. మనుషులు మాదిరిగానే ఓ మగ ఏనుగు పుష్పగుచ్చాన్ని తన తొండంతో తీసుకొని వెళ్లి ఆడ ఏనుగుకు అందించింది. ఆపై ఒక కాలును ముందుకు వంచి తొండాన్ని విచిత్రంగా ఊపుతూ ప్రపోజ్ చేసింది. దానికి ఆడ ఏనుగు లవ్‌ను యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా సంజ్ఞ ఇవ్వడంతో మగ ఏనుగు ఆనందంలో మునిగిపోయింది. దీనికి సంబందించిన వీడియోను ఎలిఫాంట్స్ ఆఫ్ వరల్డ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వీడియో వైరల్‌గా మారింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి